Venu Swamy: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈయన ప్రముఖ వీణ వాయిద్య కారిని శ్రీ వాణి నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.
శ్రీ వాణి వీణ వాయించడంలో ఎంతో నైపుణ్యం కలరు. ఇలా వీణ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె తన పేరు పక్కన వీణ చేర్చుకొని వీణ శ్రీవాణిగా మారిపోయారు.అయితే ఈమె వేణు స్వామి భార్య అనే విషయం మొన్నటి వరకు చాలామందికి తెలియదు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలియచేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.
ఇక నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో శ్రీవాణి వీణ వాయిస్తూ నాటు నాటు పాట ట్రిబ్యూట్ చేస్తూ చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రీవాణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..
ఆర్ఆర్ఆర్ టీంకి కంగ్రాట్స్ చెబుదాం. నాటు నాటు ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఇది గొప్ప గౌరవం అంటూ ఈమె ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.
ఇలా శ్రీవాణి నాటు నాటు పాటను ట్రిబ్యూట్ చేస్తూ చేసినటువంటి ఈ వీడియో చూసినటువంటి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదేం టాలెంట్ రా బాబు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈమె వీడియోకి ఫిదా అవుతూ ఈ వీడియో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…