Featured

Venu Thottempudi : ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథ పూరి వినిపించాడు… మధ్యలో ఈవివి, అశ్వినిదత్ వల్ల పోయింది : వేణు

Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో వేణు ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే కళ్యాణ రాముడు, సదా మీ సేవలో వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే దమ్ము సినిమా తరువాత ఇండస్ట్రీ కి దూరమైన వేణు దాదాపు తోమిదేళ్ల తరువాత మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో అతను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే కొన్ని మంచి స్క్రిప్ట్లను వదులుకోవాల్సి వచ్చిందని వేణు వివరించారు.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అలా వదులుకోవాల్సి వచ్చింది…

చిరునవ్వుతో సినిమా 175 రోజులు ఆడడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. మొదట అశ్వినిదత్ గారు పిలిచి ఈవివి గారితో సినిమా ప్లాన్ చేద్దాం అని స్క్రిప్ట్ చెప్పాక నచ్చడంతో ఒప్పుకున్నాను. ఇక రెండు రోజుల తరువాత పూరి జగన్నాథ్ నా దగ్గరికి వచ్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడు. చాలా నచ్చింది స్క్రిప్ట్ కానీ ఆల్రెడీ అశ్వినిదత్, ఈవివి గారితో సినిమాకు ఓకే చెప్పడంతో వదులుకోవాల్సి వచ్చింది. అక్కడికి అశ్విని దత్ గారికి వెళ్లి చెప్పాను ఇలా పూరి స్క్రిప్ట్ నచ్చింది అని చెబితే మనం ఆల్రెడీ చేయాలనుకున్నాం కాదా ఎలా మధ్యలో అంటే ఎలా అన్నారు. ఇక మాటిచ్చాను కదా అని పూరి జగన్నాథ్ సినిమాను వదులుకున్నాను.

చివరికి అశ్వినిదత్ ప్రాజెక్ట్ పోయింది. ఈవివి గారికి అశ్వినిదత్ గారికి ఏవో క్లాషెస్ వల్ల సినిమా ఆగిపోయింది. నేను చిరునవ్వుతో వంటి మంచి హిట్ ఇచ్చి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక ఈవివి గారు ముహూర్తం షాట్ కి రా మనం సినిమా చేదాం అన్నారు. వెళ్ళాక కథ మార్చారని అర్థమై, అడిగితే నీ ఇమేజ్ కి ప్లస్ అయ్యే కథనే నాకు తెలుసు కదా అంటూ వీడేవడండి బాబు సినిమా చేశాను. ఆ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా పోయిన దానికంటే వీడేవడండి బాబు సినిమా చేసినందుకు బాధేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటాము కానీ ఆ మాట నిల్పుకునే సందర్భం కూడా కరెక్ట్ గా ఉండాలని అర్థమైంది. ఇండస్ట్రీ లో గైడన్స్ ఇచ్చేవారు ఎవరు లేని రోజుల్లో అలా జరిగింది అంటూ వేణు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago