Categories: FeaturedMovie News

Venu Thottempudi : రామ్ వీరపనేని చాలా తెలివైన వాడు… లయ గురించి మా నాన్నకు చెబితే ఆయన ఒకటే అన్నాడు.. అప్పుడు నాకు బల్బ్ వెలిగింది : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన వేణు అనతి కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, కళ్యాణరాముడు, గోపి, గోపిక, గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. చివరగా ‘దమ్ము’ సినిమాలో కనిపించిన వేణు ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. తన సినిమాల్లో కామెడీ, ఎమోషన్ తో మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న వేణు అకస్మాత్తుగా సినిమాకు దూరం అయ్యాడు. మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వేణు అప్పటి తన సినిమా జర్ని గురించి చాలా విషయాలను చెప్పారు.

రామ్ చాలా తెలివైనవాడు… లయ గురించి మా నాన్న చెప్పాక…

సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నై లోనే ఉన్న వేణు కి త్రివిక్రమ్, సునీల్, ఆర్పి పట్నాయక్, చంద్ర సిధార్థ్ వంటి వారితో పరిచయంతో ‘స్వయంవరం’ సినిమా మొదలయింది. అలా కథ, మాటలు త్రివిక్రమ్, హీరోగా వేణు, మ్యూజిక్ ఆర్పి పట్నాయక్, డైరెక్టర్ గా చంద్ర సిధార్థ అనుకున్నాక పాటలు అన్నీ రెడీ అయ్యాయి. షూటింగ్ మొదలయ్యాక కథ పరంగా సినిమా రావడం లేదనిపించి వేణు షూటింగ్ ఆపేసాడు. ఇక చంద్ర సిద్ధార్థ్ ను తప్పించి విజయ భాస్కర్ ద్వారా సినిమా తీయించారు. అయితే హీరోయిన్ ను మార్చాలని విజయ భాస్కర్ అడగడంతో అప్పటికే హీరోయిన్ గా లయను ఫిక్స్ చేసినా డైరెక్టర్ వద్దనడం తో వేణు గారు వాళ్ళ నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడితే వాళ్ళ నాన్న గారు నువ్వు ఆ అమ్మాయి స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు అంటూ చెప్పడం తో, నిజమే కదా ఆల్రెడీ సినిమా కోసం సెలెక్ట్ చేసి ఇప్పుడు కాదు అంటే ఏమనుకుంటుంది అని, బల్బ్ వెలిగి వేణు వెంటనే విజయ భాస్కర్ తో ఆ అమ్మాయినే ఉంచండి సినిమాలో అని చెప్పారట.

సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో వేణు తొట్టెంపూడి మొదట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసారు. ముంబై లో యాక్టింగ్ కోర్స్ చేసిన వేణు, వడ్డే నవీన్, రామ్ వీరపనేని, సిమ్రాన్ బ్యాచ్ మేట్. ఇక ఈ విషయాల గురించి మాట్లాడుతూ వడ్డే నవీన్ చాలా తక్కువ మాట్లాడుతాడు ఎవరినైనా సరే హలో అంటే హలో అంతే ఇక సిమ్రాన్ చాలా హార్డ్ వర్కర్, రామ్ చాలా తెలివైనవాడు కోర్స్ అయ్యాక ఒక సినిమా చేసి ఇది మనకు సెట్ అవ్వదని మ్యూజిక్ ఇండస్ట్రీ వైపు చూసాడు. ఇప్పుడు అందులో నెంబర్ వన్ అయ్యాడు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago