RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!
RGV: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడినా పెద్ద వివాదం చెలరేగుతోంది.నిన్న మొన్నటి వరకు సినిమా టికెట్ల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన వర్మ తాజాగా ఐశ్వర్య ధనుష్ విడాకుల విషయంపై స్పందించారు.
ఇదిలా ఉండగా తాజాగా వర్మ మరోసారి ఏపీ మంత్రి కొడాలి నాని పై వర్మ సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..గుడివాడలో గోవా కల్చర్ తీసుకురావడం గురించి మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
గుడివాడలో గోవా కల్చర్ ను తీసుకువస్తూ గుడివాడ ప్రజలకు గోవాలో ఉన్నామనే ఫీలింగ్ కల్పించారని మంత్రి పై వర్మ సెటైర్ వేశారు. గుడివాడ ప్రజలను గోవా తీసుకువెళ్ళవచ్చు కానీ, గోవా వారిని గుడివాడ తీసుకురాలేము అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ట్వీట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.గతంలో సినిమా టికెట్ల విషయంలో కొడాలి నాని స్పందిస్తే వర్మ నాకు ఈ కొడాలి నాని ఎవరో తెలియదు నాకు తెలిసింది కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రమేనని తెలిపారు.ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ కొడాలి నాని ఎవరో తెలియదు అన్నారు మరి ఇప్పుడు ఎలా ట్వీట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మ గుడివాడను గోవాతో పోలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…