పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలామందికి రోడ్డు పక్కన ఉండే పానీపూరి తినాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ పానీ పూరి తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.చిన్న పూరీలో బఠాణీలు, ఉల్లి కట్లెట్ వేసి… నిమ్మరసంలో ముంచి ఇస్తే… నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే దాని టేస్టే చెప్పడం కన్నా తిని చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన రుచిని కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఆవులు సైతం ఎంతో ఇష్టంగా తింటున్నాయి.
ఉత్తరప్రదేశ్ , లక్నోలో, హిల్ కాన్వెంట్ స్కూల్ ఉంది. అక్కడ ఓ పానీపూరీ బండి ఉంది. ఆ పానీపూరి బండి వద్దకు ఒక ఆవు దూడ వచ్చి బండి యజమాని ఆహారం పెడతాడేమో అన్నట్టు చూస్తున్నాయి. ఈ ఆవులను గమనించిన యజమాని అందరికీ పెట్టినట్టుగానే ఆవు దూడకు ఒక్కొక్కటిగా పానీ పూరి పెడుతున్నాడు. అయితే వాటికి మనలా తినడం రాదు కనుక స్వయంగా పానీపూరి బండి యజమాని ఒక్కొక్కటి తినిపించ సాగాడు.
పానీ పూరిల రుచి బాగా ఉండడంతో ఆవులు సైతం ఒక గిన్నె మొత్తం ఖాళీ చేశాయి. అయినప్పటికీ వాటి ఆకలి తీరలేదేమో అని మరొక ప్లేట్ పూరీలు తెప్పించి వాటి ఆకలిని తీర్చాడు. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందడంతో ఎంతోమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా పానీపూరి యజమాని తనకు నష్టం వాటిల్లుతుందని భావించకుండా ఆవుకు పానీపూరి పెట్టడం పట్ల నెటిజన్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…