చికెన్ కబాబ్ గ్రిల్ చేయాలంటే మనం స్టవ్ ఉపయోగిస్తాము లేదా నిప్పుల ద్వారా గ్రిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ మీరెప్పుడైనా కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ గ్రిల్డ్ చేయవచ్చని విన్నారా.. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో.. ఓ కుర్రాళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు. అయితే చివరికి వారి ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. అసలేం జరిగిందంటే…
సుమారుగా మూడు కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్గినీ కారు పొగ గొట్టం ద్వారా వెలువడే మంటల నుంచి చికెన్ గ్రిల్లెడ్ చేయాలని భావించారు.ఈ క్రమంలోనే ఓ కుర్రాడు కారు పొగ గొట్టం వద్ద చికెన్ ముక్కలు పట్టుకుని రెడీగా కూర్చున్నారు. మరొకరు మాత్రం కారు ఎక్కి… దాని V12 ఇంజిన్‌ను రైజ్ చేశాడు. అంతలా రైజ్ చేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
కారును పెద్ద మొత్తంలో మాటిమాటికీ రైస్ చేయడం వల్ల ఏకంగా ఎగ్జాస్ట్ నుంచి మంటలే బయటకు వచ్చాయి. ఆ మంటల్లో కబాబ్‌ను గ్రిల్ చెయ్యాలని చూశాడు. కొన్ని సెకండ్లకే…కారులో నుంచి పెద్దఎత్తున పొగ రావడంతో అక్కడున్న వారు ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు.ఈ విధంగా కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన తరువాత ఒక ఎరుపు రంగు ద్రావణం కారు నుంచి లీక్ అయింది.
ఈ విధంగా కారు నుంచి పెద్ద మొత్తంలో పొగలు రావడంతో ఆ కారును ఆపడానికి ఎవరికీ రాలేదు దీంతో మంట అధికం కావటం వల్ల కారులో ప్లాస్టిక్ కూలాంట్ ట్యాంక్ ఉంటుంది. ఈ మంటలు ఆ ట్యాంకుకు తగిలాయి. దాంతో అది కూల్ పోయి హీట్ కావటం వల్లే ట్యాంక్ కన్నం పడి అందులో ఉండే లిక్విడ్ కిందకు పోయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ కుర్రాళ్ళ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతగా కబాబ్ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోని తినాలి కానీ ఈ పని ఏంటని కొందరు తిట్టగా..మరికొందరు మాత్రం ఇంత ఖరీదైన కార్లతో పిల్ల చేష్టలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…