Vidyut Jammwal : ఇటీవలే కత్రీనా కైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వంటి జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు త్వరలోనే మరొక బాలీవుడ్ జంట కూడా ఏడడుగులు వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా పెట్టు తెచ్చుకున్న విద్యుత్ జమ్వాల్ త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే విద్యుత్ హిందీలో కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్‌లీ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో IB71 అనే సినిమా చేస్తున్నారు, అంతేక్షకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నారు.
విద్యుత్ జమ్వాల్ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి, ఉసరవెల్లి సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సికిందర్ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ ఒక కీలక పాత్ర పోషించాడు. అలాగే విజయ్ హీరోగా వచ్చిన తుపాకీ చిత్రంలో కూడా విలన్ గా నటించాడు. ఇలా తెలుగు, తమిళ లో విలన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విద్యుత్ జమ్వాల్.
ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ తో…
విద్యుత్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ సెప్టెంబర్ నెల 2021లో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు బాలీవుడ్ లో చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలసి లండన్లో ఒక వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడే వివాహం కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు. మరో వైపు ఇప్పటికే వారి వివాహం జరిగిపోయింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎటువంటి హడావిడి లేకుండా కేవల సన్నిహితులు మధ్యలో వీరు పెళ్లి చేసుకోబుతున్నారు అని, ఈ విషయం గురించి త్వరోలోనే విద్యుత్ ప్రస్కటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…