Vijay Devarakonda : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’. ఈ సినిమా తెలుగు హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఆగష్టు 25న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ తో పాటు, చార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహారించారు. ఇక ఈ సినిమాలో రియల్ బాక్సర్ అయిన మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ కూడా చిత్ర బృందం బాగానే చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ, అనన్య ఒక డాన్స్ ప్రోగ్రాం కు గెస్ట్ లుగా వెళ్లడం జరిగింది.
రౌడీ వేర్ నుండి ఏది కావాలంటే అది నీకు పంపిస్తా…
ఆహా ఓటీటీ లో ‘డాన్స్ ఐకాన్’ అనే ఒక షో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. దీనికి హోస్ట్ గా ఒంకార్ వ్యవహారిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కు అనన్యతో కలసి విజయ్ దేవరకొండ గెస్టులుగా వెళ్లారు. అయితే ఇందులో ఆనంద్ అనే ఒక వ్యక్తి డాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే ఇతను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని, వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఖర్చుల కోసం ఇక్కడకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాడు అని, ప్రోగ్రాం లో వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఓంకార్ స్టేజి మీద చెప్పాడు. ఆ మాటలకూ విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ అయ్యారు.
బట్టలు లేవని నువ్వు ఫీల్ కాకు. నాకు ‘ఎవడే సుబ్రమణ్యం’ ప్రమోషన్‌కి వెళ్ళడానికి సరైన బట్టలు లేవు. ప్రొడ్యూసర్‌ని అడిగి సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్స్ తీసుకున్నాను. ఆ కాస్ట్యూమ్స్‌నే నేను వేసుకుని సినిమా ప్రమోషన్‌కి వెళ్ళేవాడిని. రౌడీ వేర్ నుంచి నీకు మొత్తం స్టాక్ పంపిస్తా, ఆ స్టైల్స్‌లో నీకు నచ్చిన బట్టలు వేసుకుని డ్యాన్స్ చెయ్” అని పార్టిసిపేంట్ ఆనంద్ కు లైవ్ లోనే మాట ఇచ్చాడు. ఈ ప్రోగ్రాం సెప్టెంబర్ 11 న రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…