Categories: FeaturedMovie News

Hema : ప్రకాష్ రాజ్ చాలాసార్లు ఏడ్చాడు.. మీకు సిగ్గుందా.. ఒక్కడిని చేసి కొడతారా.. నా శత్రువుకి కూడా రెస్పెక్ట్ ఇస్తా కానీ వీళ్లకు ఇవ్వను : హేమ

Hema : తెలుగు ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన హేమ, తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారింది. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. అయితే ఎలక్షన్ సమయంలో ఎందుకంత గొడవ జరగాల్సి వచ్చిందో స్పందించింది.

చీ సిగ్గుందా మీకు… ఒక్కడ్ని కొడతారా…

ప్రకాష్ రాజ్, విష్ణు కి రసవత్తరంగా పోటీ జరిగి విష్ణు మా అసోసియేషన్ మెంబెర్ గా గెలిచాడు. అయితే ఎలక్షన్ సమయంలో సాధారణ ఎలక్షన్ లాగా గొడవలు, రాజకీయాలు జరిగాయి. ఇక ఓటింగ్ జరిగిన రోజు జరిగిన ఉదాంతాల గురించి హేమ ఫైర్ అయింది. విష్ణు ప్యానెల్ లో వాళ్ళు ఓటింగ్ సమయంలో కూడా ప్రాంప్లెట్స్ పంచుతూ తిరగొచ్చు, ఓవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్ళు చేస్తే గొడవ చేస్తారు. ఓటింగ్ వేసే ప్రాంతంలో కూడా శివ బాలాజీ భార్య ఓటు ఎవరికి వేయాలో చూపిస్తోంది, ఓటు వేయడానికి వచ్చిన వాళ్లకు అది తప్పుగా అనిపించడం లేదు కానీ శివ బాలాజీ, నరేష్ కి బయట ప్రకాష్ రాజ్ కి సంబంధిచిన మనుషులు ప్రచారం చేస్తే తప్పైపోయింది. నరేష్ కి సంబందించిన బాడీ గార్డ్ లు ఆ ప్రచారం చేసే అబ్బాయిని కొట్టడానికి పోతే నేను అడ్డుకోడానికి వెళ్ళబోయాను శివ బాలాజీ చేయి అడ్డం పెట్టి ఆపాడు.

దీంతో నేను తప్పించుకోడానికి కరిచాను, కానీ నేను చేయి పైన కరిస్తే, చేయి పై వేరే చోట కరిచినట్లు చూపిస్తున్నాడు, కట్టు కట్టించి ఇంజక్షన్ వేయించి హాస్పిటల్ వెళ్లి తెగ హడావిడి చేసారు. ఇక విష్ణు ప్యానెల్ లో వాళ్ళు మాట్లాడిన బూతులకు చాలా సార్లు ప్రకాష్ రాజు గారు ఏడ్చారు. కానీ గొడవలు వద్దు అని అయన గాంధీ మార్గంలోనే వెళ్లారు. నేను చేయి కరిచినపుడు కూడా వెళ్లి వివరిస్తాను మీడియాకు అని చెప్పినా వద్దు గొడవలు వద్దు అంటూ అయన చెప్పారు. ఇపుడు మా అసోసియేషన్ వైపు వెళ్లడం లేదు, మేము చేయనియ్యం పనులు అంటూ మళ్ళీ గొడవలు ఎందుకు, అందుకే అసలు వెళ్లడం లేదు, వాళ్ళే చేసుకోని అని వదిలేసాము అంటూ చెప్పారు హేమ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago