Puri Jagannadh: చీప్ గా మాట్లాడొద్దు.. బండ్ల గణేష్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన పూరి.. వైరల్ అవుతున్న ఆడియో?
Puri jagannadh: ఆగస్టు 24వ తేదీ వరకు పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టబోతున్నారని ప్రతి ఒక్కరూ భావించారు. ఇలా ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ అలాగే అభిమానులలోను ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ఫస్ట్ షో బొమ్మ డిజాస్టర్ కావడంతో ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరి అయిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదు.ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున పూరి జగన్నాథ్ గురించి కామెంట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు పోకిరి సినిమా చేసిన పూరి జగన్నాథ్ సినిమా నేనా ఇది అంటూ కొందరు కామెంట్లు చేశారు.
ఏది ఏమైనా పూరి జగన్నాథ్ సినిమాలు ఒకప్పటిలా లేవని ఈయన కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయికానీ నీకోసం వదిన ఎంతో కష్టపడింది తనను కష్టపెట్టకు తనని బాగా చూసుకో అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా కొందరు ఈ విషయాలపై స్పందిస్తూ ప్రస్తుతం కామెంట్లు చేస్తున్నారు ఒకప్పుడు పూరి జగన్నాథ్ తన భార్యను చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె ఉసురే తనకు తగిలిందని, అందుకే తన సినిమా ఇలా డిజాస్టర్ అయ్యింది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ అసలే సినిమా ఫ్లాప్ అయిందన్న బాధలో పూరి జగన్నాథ్ ఉండగా మరి ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టడం అవసరమా అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…