Vijay Devarakonda : ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పాత్రలను చేసిన విజయ్ ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. కానీ ఇదంతా జరగడానికి విజయ్ చాలా కష్టపడ్డాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా పూరీ దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్ లో విజయ్ నెపోటిజం గురించి మాట్లాడారు. ఆవి జనాల్లో బాగా చర్చకు దారితీశాయి.
స్టార్ కిడ్స్ కి ఆ బాధలు ఉండవు…
మా నాన్న, తాత ఎవరో తెలియక పోయినా నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు అంటూ చేసిన వాఖ్యలు స్టార్ కిడ్స్ ను పరోక్షంగా అనడమే అనట్లుగా అనిపించింది. ఇక తాజాగా కాఫీ విత్ కరణ్ లో కూడా విజయ్ మళ్ళీ నెపోటిజం గురించి ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. మన పుట్టుకను మనం నిర్ణయించం, ఇలానే పుట్టాలి, ఇంతే హైట్ ఉండాలి అన్నది మనం నిర్ణయించం, అలా స్టార్ హీరోకి వారసుడిగా పుట్టాలని కూడా మనం నిర్ణయించం అంటూ డిప్లొమాటిక్ సమాదానం చెప్పాడు. రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళు స్టార్ కిడ్స్ అవుతారు, కానీ ఎవరి జీవితంలో వాళ్ళే పోరాడాలి.
స్టార్ కిడ్ కి ఉన్న అడ్వాంటేజ్ మంచి ప్రారంభం దొరుకుతుంది. నేను పడిన కష్టాలు, అవమానాలు వారికి ఉండవు. ఆ అవమానాలు, ఒడిదుడుకులే నన్ను హీరోని చేసాయి అంటూ నేను నెపోటిజం కి వ్యతిరేకం కాదు అన్నట్లుగా పరోక్షంగా మాట్లాడారు రౌడీ బాయ్. లైగర్ సినిమా విజయం విజయ్ దేవరకొండ కెరీర్ కి కీలకం, అంతకు ముందు వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో హిట్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ఇక లైగర్ సినిమా తరువాత విజయ్ మళ్ళీ పూరీ కాంబినేషన్ లోనే జనగణమన సినిమా చేయబోతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…