Kalyan Ram: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన పలు సినిమాలలో నటించిన సరైన గుర్తింపు లభించకపోవడంతో ఏకంగా నిర్మాతగా మారిపోయారు. ఇలా తన నిర్మాణంలో పలు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు నటుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా అనే సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్స్ విపరీతంగా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి ఈయన పక్కా హిట్ కొట్టేలా ఉన్నారు అనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం తాను ఎలాంటి హార్డ్ వర్క్ చేశారో తెలిపారు. ఎంతమంచి వాడవురా సినిమా సమయంలో తాను 88 కేజీల శరీర బరువు ఉన్నానని, సినిమా కోసం తాను ఏకంగా 13 కిలోల బరువు తగ్గానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈవిధంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇలా తాను 88 నుంచి 75 కేజీలకు తగ్గానని చెబుతూనే తన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథ ఏంటి అనే విషయం గురించి కూడా వెల్లడించారు.
త్రిగర్తల సామ్రాజ్యానికి చెందిన ఒక క్రూరమైన రాజు ఆ కాలం నుంచి ప్రయాణం చేస్తూ ప్రస్తుత కాలంలోకి వచ్చాడు. ఇలా వచ్చిన ఆయనలోఎలాంటి మార్పులు వచ్చాయి అతను ఎలా ప్రవర్తించాడు అనేది ఈ సినిమా కథాంటూ కళ్యాణ్ రామ్ అసలు విషయం వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…