Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. సమంత విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈయన చెన్నైలో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
చెన్నైలోని కోయంబత్తూర్ కాలేజీ స్టూడెంట్స్ తో విజయ్ దేవరకొండ మీట్ అవుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక స్టూడెంట్ విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ మీరు రష్మికతో కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ మీ దగ్గర ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పండి ఇప్పుడే చేస్తాం అటు సమాధానం ఇచ్చారు.
రష్మికతో కలిసి నటించడానికి తాను కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని మంచి కథ దొరికితే తాను కూడా రష్మికతో కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఈయన సమాధానం చెప్పారు. ఇలా రష్మిక గురించి విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇప్పటికే గీతగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో వీరిద్దరి పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండడంతో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అదేవిధంగా ఈ సినిమాలో వీరికి కెమిస్ట్రీ చూసి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…