Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో సహాయ నటుడు పాత్రలో నటించినప్పటికీ ఈయన హీరోగా తెలుగు తెరకు పరిచయమైంది మాత్రం పెళ్లి చూపులు సినిమాతోనే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరికెక్కిన పెళ్లిచూపులు సినిమా ద్వారా విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు.
ఈ విధంగా ఈ సినిమా మంచి హిట్ కావడంతో తనకు అనంతరం అర్జున్ రెడ్డి, గీతగోవిందంవంటి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా ఈ సినిమాలన్నీ కూడా హిట్ కావడంతో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన తాజాగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ విడుదల కాగా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నటించిన మొట్టమొదటి చిత్రం పెళ్లి చూపులు సినిమాలో నటించాల్సింది విజయ్ దేవరకొండ కాదని వేరే హీరో ఈ సినిమా వదులుకోవడంతో ఆ అవకాశం విజయ్ దేవరకొండకు వచ్చినట్టు తెలుస్తుంది.
పెళ్లిచూపులు సినిమా కథ సిద్ధం చేసుకున్న తర్వాత తరుణ్ భాస్కర్ ఈ సినిమాని మొదటిగా నిఖిల్ వద్దకు తీసుకెళ్లారట. కథ మొత్తం విన్న నిఖిల్ సినిమా చాలా అద్భుతంగా ఉంది వెంటనే చేసేద్దామని చెప్పారు. అయితే అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ దొరకకపోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా అలాగే ఉండిపోయింది. ఇక ఈ సినిమా ఫైనల్ కాకపోవడంతో నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాకి కమిట్ అయ్యారు.ఈ క్రమంలోని పెళ్లిచూపులు సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడంతో నిఖిల్ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఈ సినిమా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లగా ఆయన ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇలా నిఖిల్ మిస్ చేసుకున్న ఈ హిట్ సినిమాని విజయ్ దేవరకొండ నటించి మంచి విజయం సొంతం చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…