Categories: FeaturedMovie News

నా పెళ్లి అప్పుడే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ!

పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ అమ్మాయిలందరికి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ పెళ్లి ఇప్పుడే చేసుకోనని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

అయితే ముందుగా తన కంటే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ వివాహం జరుగుతుందని ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆనంద్ దేవరకొండ దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్పకవిమానం చిత్రాన్ని తన అన్న విజయ్ దేవరకొండ నిర్మించడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వారి వ్యక్తిగత విషయాలను గురించి తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్న ఈ బ్రదర్స్ వారి తల్లిదండ్రుల గురించి కూడా ముచ్చటించారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి విషయం ప్రస్తావన రాగా తన పెళ్లి ఇప్పట్లో ఉండదని తన తమ్ముడు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని తెలియజేశారు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago