Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది.
ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్ద ఎత్తున సినిమా డిస్ట్రిబ్యూటర్లు విజయ్ దేవరకొండపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ సినిమాని బాయికాట్ చేయాలంటూ నార్త్ లో పెద్ద వార్తలు రావడంతో విజయ్ దేవరకొండ సినిమాని బాయ్ కాట్ చేస్తే కొట్టడమే అంటూ చేసిన వ్యాఖ్యలు ద్వారా ప్రేక్షకుల థియేటర్ కి రావడం మానేశారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనుగోలు చేసే దారుణంగా నష్టపోతున్నారని హీరో విజయ్ దేవరకొండ పై మండి పడుతున్నారు. మల్టీప్లెక్స్ ఓనర్ మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ నువ్వు దేవరకొండ కాదు అనకొండ అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. సినిమాని బ్యాన్ చేయమను అంటూ పెద్ద పోటుగాడిలా ఎగిరావు నీ స్టేట్మెంట్ వల్ల ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు అంటూ ఈయన విజయ్ పై మండిపడ్డారు.
గతంలో నీలాగే తాప్సి కూడా ఎగిరింది ఇప్పుడు ఏమైంది రోడ్డు కొచ్చి పడింది దయచేసి రాజకీయాలు చేయకండి. మీ స్టేట్మెంట్ వల్ల నిర్మాతలు ఏమాత్రం నష్టపోరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున నష్టపోతారు అంటూ ఈయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…
పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…
తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…
యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…
టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…
ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రతి ఇంటి రొజూ పని. అయితే, ఈ పనిలో ఉపయోగించే పదార్థాలు కూడా చాలా ముఖ్యం.…