Categories: FeaturedMovie News

బుల్లితెరపై సందడి చేయనున్న రష్మిక -విజయ్ దేవరకొండ..

వెండితెరపై సెన్సేషనల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ఈ జోడీ చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెండితెరపై వీరిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ఈ విధంగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు.

బుల్లితెరపై ఈ జంట కలిసి ఏ షోలోనో, లేదా ఏ కార్యక్రమంలోనూ నటించలేదు. ఈ జంట కలిసి ఓ కమర్షియల్ యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేయనున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాణిజ్య ప్రచారకర్తగా కొనసాగుతున్న సబ్బుల తయారీ సంస్థకు ఇకపై విజయ్ దేవరకొండ -రష్మిక బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరిపై ఇటీవల యాడ్ కి సంబంధించిన షూటింగ్ ముంబైలోని ఓ హోటల్లో చిత్రీకరించారు. ఈ యాడ్ కోసం బంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చుని రష్మికకు ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్లు ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంట కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అందరిని ఫిదా చేసేలా ఉందని, కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరిద్దరూ నటించిన ఈ కమర్షియల్ యాడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago