తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ నటించిన వరుస సినిమాలు విజయవంతం కావడంతో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం “రౌడీ బాయ్స్”. ఈ ఈ సినిమాలోని ప్రేమే ఆకాశం అనే పాటను విడుదల చేయడానికి దిల్ రాజు ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ్ దేవరకొండను ఆహ్వానించడంతో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి విజయ్ ఎంతో స్టైలిష్ లుక్ లో వెళ్లారు.
బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధరించి వెళ్లడంతో అందరి చూపు ఆయన టీ షర్ట్ పై పడింది. స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధర ఎంత ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి.
అయితే విజయ్ దేవరకొండ నటించిన ఈ టీ షర్ట్ ధర ఇండియాలో సుమారుగా రూ.10,500 ధర ఉంటుందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా ఎంతో స్టైలిష్ గా కనిపించే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం వస్త్ర వ్యాపారం మాత్రమే కాకుండా ఏవీడీ అనే మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా ఉండబోతోందని ప్రకటించారు.
అమెరికా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు Donald Trump ప్రారంభించిన టారిఫ్ యుద్ధానికి అమెరికా అత్యున్నత న్యాయస్థానం…
రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…
ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…
డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్‌లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…