Polaaki Vijay: టాలెంట్, కష్టపడే తత్వం ఉండాలే కానీ.. ఎప్పుడో ఒకప్పుడు పైకిరావడం ఖాయం. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే టాలెంట్ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. టెక్నీషియన్ల వర్క్ నచ్చితే స్టార్లను వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లతోనే వర్క్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.
అది డైరెక్టర్లు కావచ్చు, మ్యూజిక్ కంపోజర్లు కావచ్చు, కొరియో గ్రాఫర్లు కావచ్చు. టాలెంట్, హార్డ్ వర్క్ ఉన్నవారికి సినీరంగం ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. తాజాగా పుష్ప సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన విజయ్ పోలంకికి ఇలాంటి ఎంకరేజ్మెంటే దొరుకుతోంది. అల్లు అర్జున్, సమంత వంటి స్టార్లతో ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ యంగ్ కొరియోగ్రాఫర్.
ఓ ప్యాన్ ఇండియా సినిమాకు కొరియోగ్రఫీ చేయడం అంటే అంత సులువు కాదు. టాలీవుడ్ తో పాటు యావత్ దేశం కూడా అంతా గమనిస్తుంటుంది. అయితే ఇటీవల పుష్ప పంక్షన్ లో అల్లు అర్జున్ ప్రత్యేకంగా విజయ్ పోలంకిని పొగుడుతూ మాట్లాడారు. పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా, ఉ ఉ అంటావా’ సాంగ్ కు కూడా విజయ్ పొలంకి యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతాకు బాగా నచ్చింది. అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది.
విజయ్ పోలంకి ఇటీవల విజేత, కొబ్బరి మట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి వంటి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. తాజాగా గల్లా అశోక్ బాబు హీరో సినిమాకు కూడా డ్యాన్స్ కంపోజ్ చేశాడు. హీరో సినిమాలోని డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ కు విజయ్ కంపోజ్ చేసిన స్టెప్పులకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో నరకాసురతోపాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు పనిచేయబోతున్నాడు విజయ్ పోలంకి. ఈ యంగ్ కొరియోగ్రాఫర్ టాప్ కొరియోగ్రాఫర్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశం ఉంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…