Vijay Sethupathi: విజయ్ సేతుపతి పరిచయం అవసరం లేని పేరు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగులో కూడా ఈయన ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నటి కృతి శెట్టి తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.
ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన నటించిన మహారాజ సినిమా జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతి శెట్టి గురించి మరోసారి విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా DSP సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలని మేకర్స్ భావించారట. ఆమెను హీరోయిన్గా తీసుకుంటే తాను నటించనని దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. ఎందుకంటే ఆమె తన కూతురి పాత్రలో ఉప్పెన సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో కృతి శెట్టి కొన్ని సన్నివేశాలలో నటించడానికి చాలా భయపడ్డారని విజయ్ సేతుపతి తెలిపారు.
కూతురితో సమానం…
ఆ సమయంలో నాకు నీ వయసంత కుమారుడు ఉన్నారు. నువ్వు కూడా నాకు కూతురితో సమానమే ఎలాంటి భయం లేకుండా నటించు అంటూ తనకు ధైర్యం చెప్పాను ఇలా కూతురితో సమానంగా భావించి నటించిన అమ్మాయితో రొమాన్స్ చేయడం అంటే నా వల్ల కాదు అంటూ విజయ్ సేతుపతి మరోసారి కృతి శెట్టి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…