NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది అభిమానులు కోరుతున్నప్పటికీ రాజకీయ ఎంట్రీ పై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు.
ఇకపోతే తాజగా ఏపీ ఎన్నికలలో భాగంగా కూటమి అధికారంలోకి రావడంతో సినిమా సెలబ్రిటీలు మొత్తం సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం తన మామయ్య చంద్రబాబు నాయుడుతో పాటు తన అత్తయ్య పురందేశ్వరి అలాగే బాబాయ్ బాలకృష్ణ తో పాటు తన బావలు అయినటువంటి లోకేష్ అలాగే ఎంపీగా గెలిచిన భరత్ ని ట్యాగ్ చేస్తూ అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఎన్టీఆర్ అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో చంద్రబాబు నాయుడు సైతం స్పందించి థాంక్యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎంపీ భరత్ భార్య బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అన్నయ్యకు రిప్లై ఇచ్చారు.
రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతాం…
ఈ సందర్భంగా తేజస్విని రిప్లై ఇస్తూ..థాంక్యూ తారక్ అన్న, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమంతా కృత నిశ్చయంతో ఉన్నాం. దేవర సినిమాతో మీకు మంచి విజయం వస్తుందని కోరుకుంటున్నాను అని తెలిపారు. అయితే ఈ ట్వీట్ భరత్ సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చింది. ఆయన పోస్ట్ చేసి ఉంటే బావ అని పిలిచేవారు అలా కాకుండా అన్నయ్య అని పిలవడంతో తప్పకుండా తేజస్విని చేసి ఉంటారని తెలుస్తుంది.ఈ అన్నాచెల్లెల అనుబంధానికి అభిమానులు ఫీదా అవుతున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…