తమిళ నటుడు విజయ్ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై నటుడు స్పందించాడు కూడా. అతడికి.. మాకు ఫ్లైట్ ఉన్నప్పుడు చిన్న విషయంపై వివాదం అయిందని.. అయితే అతడు తాగి ఉన్నాడని సేతుపతి చెప్పుకొచ్చాడు.
కానీ ఈ విషయంపై బయట పెద్దది చేస్తున్నారని.. అంతలా ప్రచారం చేసేంత అక్కడ ఏమి లేదని చెప్పుకొచ్చాడు. అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని.. అక్కడితోనే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని కూడా చెప్పాడు విజయ్. అయితే విజయ్ సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి పేరు మహా గాంధీ. అతడు ప్రస్తుతం ఓ పెద్ద సెలబ్రిటీ హోదాను పొందాడు.
అతడు అక్కడ కన్నడ యూట్యూబ్ ఛానళ్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. నీతి బోధలు చేస్తున్నాడు. తాను కూడా చిన్పపాటి నటుడినే అని చెప్పుకొచ్చాడు గాంధీ. విజయ్ సేతుపతి నటన అంటే తనకు బాగా ఇష్టమని.. ఇప్పటి వరకు తన సినిమాలు చూడలేదని అన్నాడు. తాను విజయ్ సేతపతి ఇద్దరం ఒకే ఫ్లైట్ లో జర్నీ చేశామని. మొదట అతడిని చూడగానే విష్ చేశానని.. కాని అతడు వెటకారంగా స్పందించాడని వాపోయాడు.
మర్యాద ఇచ్చినప్పుడు.. తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సంస్కారం అని.. అక్కడ ఆ హీరో హావభావాల్లో కనిపించలేదన్నాడు. అయినా తను ఫీల్ అవ్వలేదని.. అక్కడే ఉన్న అతడి అసిస్టెంట్ మాత్రం దురుసుగా ప్రవర్తించాడని చెప్పాడు. అందుకు అక్కడ కాస్త గొడవ మొదలైందన్నాడు. విజయ్ సేతుపతి ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉంటే.. ఈ మహా గాంధీ పెద్దది చేసి .. తన పాపులారిటీ పెంచుకునే పనిలో ఉండటంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…