Liger Movie: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటిస్తున్న లైగర్ సినిమా పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది.ఇక ఈ సినిమా విడుదల కాకుండానే విజయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఈ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ క్రమంలోనే ముంబైలో ఒక షాపింగ్ మాల్ లో నిర్వహించిన ఈవెంట్ కు పెద్ద ఎత్తున బాలీవుడ్ అభిమానులు తరలి వచ్చారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కి ఉన్న క్రేజ్ చూసిన ఇతర బాలీవుడ్ హీరోలు కుళ్ళు కోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అభిమానులు రావడంతో చిన్నపాటి తోపులాట జరిగింది. ఇలా అభిమానులను కట్టడి చేయడం కూడా కష్టతరం కావడంతో విజయ్ దేవరకొండ అనన్య పాండే అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇక ఈ ఈవెంట్లో లేడీ ఫ్యాన్స్ అయితే విజయ్ దేవరకొండను చూసి ఐ లవ్ యు విజయ్ అంటూ పెద్దగా కేకలు వేశారు. మొత్తానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారని తెలుస్తోంది.ఇలా ఒక సౌత్ హీరో నటించిన సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఇలా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం విశేషం. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…