BHEL Prasad : భేల్ ప్రసాద్ అనే పేరుతో పిలిస్తే చాలా మందికి తెలియక పోవచ్చు, అయితే విల్సన్ అనే పేరు చెబితే మాత్రం ఈయన ఎవరు అన్నది ఇట్టే చెప్పేస్తారు. అవును మరి చక్రవాకం సీరియల్ లోని విల్సన్ పాత్రతో అంతగా అభిమానులలో పేరు సంపాదించుకున్నాడు. చక్రవాకం తరువాత కొన్ని సీరియల్స్ లతో పాటు సినిమాలలో కూడా నటించాడు. చిరంజీవితో ఖైదీ నం.150 లో కూడా నటించాడు. ఒక ఇంటర్వ్యూలో ప్రసాద్ చిరంజీవితో కలసి నటించిన సినిమాలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.
కూతురు అడుగుతుంటే తట్టుకోలేక ఏడుపు వచ్చేసింది…
ఖైదీ నం.150 సినిమాలో నటించేటప్పుడు జరిగిన అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. నా కూతురు అమెరికా వెళ్లాల్సి వుంది సరిగ్గా ఆరోజే ఖైదీ నం.150 సినిమా షెడ్యూల్ కూడా వుంది. అందరిని ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి నేను షూటింగ్ అయిపోయాక నేరుగా వస్తాను అని చెప్పాను. అయితే షూటింగులో చాలా సేపు నీళ్లలో ఉండాల్సిన సీన్, అందులోను రాత్రి, సీన్ అయిపోయాక స్నానం కోసం వేడి నీళ్లు పెట్టారు. అయితే నేను తొందరగా వెళ్ళాలి అన్న తొందరలో చాలా వేడిగా వున్న నీరు ఒంటిమీద పోసుకున్నాను. వెంటనే బొబ్బులు వచ్చేసాయి.
అది కూడా ఏం పట్టించుకోకుండా కూతురిని చూడటానికి బయలుదేరాను. అయితే వినాయక గారు హోస్పిటల్ కు తీసుకెళ్లమని నా కారు వెంట పంపించారు. మధ్యలో ఆపి ట్రీట్ మెంట్ తీసుకొని వెళ్ళాను. ఎయిర్పోర్టుకి వెళ్ళాక చెప్పకుండా కవర్ చేసాను అయితే కూతురు కదా చిన్న బ్యాండ్ఎయిడ్ చూసి ఏడవడం తో నాకు కూడా ఏడుపు ఆగక చెప్పేసాను, అని చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు. దాన్ని ఎపుడు మర్చిపోలేను అని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…