Featured

Vijaya Shanthi : రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాల వైపు చూస్తున్న రాములమ్మ… ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్..!

Vijaya Shanthi : లేడీ అమితాబ్ బచ్చన్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అగ్రహీలందరితో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక హీరోలతో సమానమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన రాములమ్మ ప్రస్తుతం సంధిగ్ధం లో ఉంది. రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాములమ్మ ప్రస్తుతం కన్ఫ్యూషన్ మోడ్ లో ఉంది. తెరాస నుండి కాంగ్రెస్ అటు నుండి బీజేపీ లో చేరిన విజయశాంతి ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ లో కెసిఆర్ కి ధీటుగా ఉంది అంటే బీజేపీ మాత్రమే. ఈమధ్య కాలంలో తెలంగాణ లో బీజేపీ క్రియాశీలకంగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

పార్టీలో ప్రముఖ్యత లేదు అందుకే సినిమాల వైపు…

తెలంగాణ లో బీజేపీ యాక్టీవ్ మోడ్ లో ఉంటే విజయశాంతిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదంట. పార్టీలో తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి మరీ నన్ను మాట్లాడనివ్వడం లేదు అని ప్రాముఖ్యత ఇవ్వడమూ లేదని చురకలు వేశారు. ఇక రాజకీయంగా ఇలా కన్ఫ్యూషన్ లో బీజేపీ పెట్టేయడంతో రాములమ్మ ఇక అయ్యేపని కాదని సినిమాల వైపు చూస్తోందట. ఆ మధ్య మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి రీ ఎంట్రీలో అదుర్స్ అనిపించింది.

ఇక ఇప్పుడు చిన్న రామయ్య సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపస్తున్నాయి. ఎన్టీఆర్ అంటే విజయశంతికి చాలా అభిమానం అంట అందుకే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. ఇక అసలు ఏ సినిమాలో ఎన్టీఆర్ తో నటిస్తోంది, ఒప్పించిన డైరెక్టర్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ లో ఉంది. కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించడం మాత్రం పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. బాబాయ్ తో హిట్ పెయిర్ గా నిలిచిన జయమ్మ అబ్బాయి సినిమలో ఎలాంటి పాత్రతో రానుందో వేచి చూడాల్సిందే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago