Singer Smitha : తొలి తెలుగు పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించిన స్మిత, ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ‘ఇషా’ సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది.
పాత కాలం పద్దతిలో…
హోమ్ టూర్ వీడియో.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. చిన్న చిన్న సెలబ్రిటీల దగ్గర నుండి బడా సెలబ్రిటీల వరకు వాళ్ల ఇల్లు ఎలావుంటుందో చూడలేని అభిమానుల కోసం అందరూ హోమ్ టూర్ వీడియో చేసి అందరితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కోవలోకే వస్తారు సింగర్ స్మిత. ఆయితే సింగర్ స్మిత ఇల్లు మాత్రం అందరినీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడరన్ లుక్ వదిలేసి పాతకాలం రూపు రేఖలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సీలింగ్ పైన కనిపిస్తున్న అష్ట లక్ష్ములు, దశవతారం సంబందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ఇంటిలోకి వెళ్తూనే కుడివైపు ఉన్న చిన్న గార్డెన్ మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తోంది. ఇక ఇంటిలో స్మిత గారి నాన్నమ్మలు, తాతయ్య కాలం నాటి వస్తువులు ముఖ్యంగా శ్రీ రాముల విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో కనిపించే సీతారాముల కళ్యాణంకి సంబందించిన పెయింటింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా ప్రస్తుతం స్మిత హోమ్ టూర్ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…