గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు లేడీ అమితాబ్ గా విజయశాంతి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. ఈమె నటించిన ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం సినిమాలు ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పటికే ఎంతో ఫామ్లో ఉన్న విజయశాంతి ఎన్నో అద్భుతమైన సినిమాలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు విజయబాపినీడు దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా నటించినటువంటి చిత్రం “గ్యాంగ్ లీడర్”. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర కొంతవరకు డామినేటింగ్ అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి విజయశాంతికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో విజయశాంతి పాత్రను దర్శకుడు కొంత డిజైన్ చేయగా ఆన్ ది స్పాట్ లో విజయశాంతి తన పాత్రను సరికొత్తగా డిజైన్ చేసి నటించారని ఓ సందర్భంలో వెల్లడించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విజయానికి తనే కారణమని, తన వల్లే సినిమా హిట్ అయిందని అప్పట్లో విజయశాంతి ప్రచారం చేసుకుందనే వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూ సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించిన విజయశాంతి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా విజయవంతం కావడానికి కారణం తనేనని, అలాంటి మాటలు తాను ఎప్పుడూ మాట్లాడలేదని, ఎవరో గిట్టనివాళ్లు తన గురించి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.ఒక వేళ ఆ రోజు నేను ఆ మాటలు అని ఉంటే తర్వాత మేమిద్దరం కలిసి మెకానిక్ అల్లుడు అనే సినిమాలో నటించే వాళ్ళం కాదని ఇంటర్వ్యూ సందర్భంగా విజయశాంతి తెలిపారు.తన మొదటి ఇన్నింగ్స్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న…
తెలంగాణ గ్రామాలకు కేంద్రం నుంచి మరోసారి ఆర్థిక ఊతం లభించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 15వ ఆర్థిక సంఘం మూడో…
ప్రేమ, పెళ్లి, సంబంధాలు—కాలం మారేకొద్దీ ఇవన్నీ కొత్త రూపం దాలుస్తున్నాయి. ఒకప్పుడు “పర్ఫెక్ట్ వ్యక్తి దొరకాలి” అనే ఆశ ఎక్కువగా…