Movie News

బాలకృష్ణ కోసం నన్ను తప్పించి ఎంతో అవమానించారు.. : నటుడు చంద్రమోహన్..!

యస్‌.డి. లాల్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు, మురళీకృష్ణ, బాలకృష్ణ అన్నదమ్ములుగా కలిసి నటించినటువంటి చిత్రం “అన్నదమ్ముల అనుబంధం”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో “ఆనాటి హృదయాల ఆనంద గీతం”అనే పాట పెద్ద ఎత్తున శ్రోతలను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు చంద్రమోహన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నిజానికి ఈ సినిమాలో చిన్న తమ్ముడు పాత్రలో నటించాల్సిందిగా చంద్రమోహన్. ఈ విషయమై దర్శక నిర్మాతలు చంద్రమోహన్ ని ఒప్పించి అతనికి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ పాటకు చంద్రమోహన్ 15 రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేశారు. ఇక పాట షూటింగ్ కోసం సెట్ కి వెళ్ళిన చంద్రమోహన్ మేకప్ రూమ్ కి వెళ్ళి కూర్చున్నారు. ఎంత సేపటికీ మేకప్ వేయడానికి ఎవరూ రాలేదు. అదేవిధంగా సినిమా సెట్ లో పాట వినిపించడంతో చంద్రమోహన్ ఈ పాటను రిహార్సల్స్ చేస్తున్నారని భావించారు.

ఈ క్రమంలోనే నిర్మాత పితాంబరం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చంద్రమోహన్ ఎవరు రాకపోయేసరికి వెళ్లి సెట్లో డోర్ తీసి చూడగా ఆ పాటలో తనకిచ్చిన కాస్ట్యూమ్స్ తో వేరే కుర్రాడు నటించడం చూసిన చంద్రమోహన్ ఎంతో ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే అక్కడున్నవారు ఆ పాత్రలో ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ చేస్తున్నారని చెప్పగా ఎంతో అవమానంతో రూమ్ కి వెళ్లి కూర్చున్న చంద్రమోహన్ దగ్గరకు నిర్మాత పీతాంబరం వచ్చి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళండి సాయంత్రం నేను వచ్చి మాట్లాడతాను చిన్న పొరపాటు జరిగిందని చంద్రమోహన్ చేతులు పట్టుకొని వేడుకున్నారు.

అంత పెద్దాయన అలా వేడుకొనే సరికి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన చంద్రమోహన్ ని కలిసిన పీతాంబరం చివరి నిమిషంలో ఎన్టీఆర్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అప్పటికి అతనినీ ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని చెప్పడంతో చంద్రమోహన్ ఎంతో అవమాన పడ్డారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడం కొంతవరకు చంద్రమోహన్ కు కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

ఇదే సినిమాని తమిళంలో ఎంజీఆర్ హీరోగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఎంజీఆర్ తమ్ముడి పాత్రలో నటించే అవకాశాన్ని చంద్రమోహన్ కి కల్పించారు. ఎంజీఆర్ ను కలిసిన చంద్రమోహన్ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో చంద్రమోహన్ ను ప్రోత్సహించి ఆ సినిమాలో తన తమ్ముడి పాత్రలో అవకాశం కల్పించాలని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుందని ఓ సందర్భంలో చంద్రమోహన్ ఈ విషయాన్ని తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago