Vijaya Shanti: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వెంకటేష్ ఒకరు. వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా కుటుంబ సమేతంగా కలిసి కూర్చుని చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఈయనకు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా పెరిగిపోయారు.
ఇలా గత మూడు దశబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వెంకటేష్ తాజాగా డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఈయన నటుడు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండడం చేత ఎంతో మంది ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
ఇకపోతే ఈ వెబ్ సిరీస్ పై తాజాగా వెండితెర నటి విజయశాంతి స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా ఈమె ఈ వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ… మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై……”It needs Strict Censoring for ott platform”…అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.
ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్న అంశాన్ని గమనించి వెంటనే Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ..ప్రజల తనకిచ్చిన అభిమానాన్ని గౌరవాన్ని నిలబెట్టుకుంటా అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…