“బాహుబలి” తో తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు రాజమౌళి, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజగా విజయేంద్ర ప్రసాద్ “అలీతో సరదాగా” షోలో పలు ఆశక్తికర విషయాలు బయటపెట్టారు. RRR సినిమా గురించి, తన కొడుకు రాజమౌళి గురించి మాట్లాడిన ఆయన వీటితో పాటుగా తన భార్య గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు. తమది కులాంతర వివాహం అని.. తన భార్య కులం తెలియకుండానే తానూ పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వల్ల తన భార్య కులం తరువాత తెలిసిందన్నారు.
ఆసమయంలో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లి సమయంలో ఆమె కులం ఏంటి అన్నది తనను ఎప్పుడూ అడగలేదని.. అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారు. అయితే తను మెగాస్టార్ చిరంజీవికి విరాభిమాని అని తెలుసన్నారు. ఈ క్రమంలో పెళ్ళైన కొద్దిరోజుల తరువాత చిరంజీవి కనిపించిన ప్రతిసారీ.. మా చిరంజీవి.. మా చిరంజీవి అని తను అనేదని.. అన్నారు.
ఆమె అన్ని సార్లు అలా అంటుండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగేసా.. “మాట్లాడితే మా చిరంజీవి అంటావ్ ఎందుకు” అని.. అప్పుడు ఆమే “మా ఇద్దరిదీ ఒకటే కులం” అని తన భార్య చెప్పిందని.. అందుకే మా చిరంజీవి అంటుందని తెలుసుకున్నానన్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి వలెనే తన భార్య కులం తనకి తెలిసిందని చెప్పారు విజయేంద్రప్రసాద్. అయితే తన కొడుకు రాజమౌళి బాహుబలి సక్సెస్ చూడకుండా ఆమె చనిపోయిందని.. ఆర్నెళ్లపాటు కోమాలో ఉండి తరువాత చనిపోయిందని చెప్పారు విజయేంద్రప్రసాద్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…