చిరంజీవి వలనే నా భార్య కులమేంటో తెలిసింది. : విజయేంద్ర ప్రసాద్..!

0
245

“బాహుబలి” తో తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు రాజమౌళి, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ “అలీతో సరదాగా” షోలో ప‌లు ఆశక్తికర విష‌యాలు బయటపెట్టారు. RRR సినిమా గురించి, తన కొడుకు రాజమౌళి గురించి మాట్లాడిన ఆయన వీటితో పాటుగా తన భార్య గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు. తమది కులాంతర వివాహం అని.. తన భార్య కులం తెలియకుండానే తానూ పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వల్ల తన భార్య కులం తరువాత తెలిసిందన్నారు.

ఆసమయంలో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లి సమయంలో ఆమె కులం ఏంటి అన్నది తనను ఎప్పుడూ అడగలేదని.. అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారు. అయితే తను మెగాస్టార్ చిరంజీవికి విరాభిమాని అని తెలుసన్నారు. ఈ క్రమంలో పెళ్ళైన కొద్దిరోజుల తరువాత చిరంజీవి కనిపించిన ప్రతిసారీ.. మా చిరంజీవి.. మా చిరంజీవి అని తను అనేదని.. అన్నారు.

ఆమె అన్ని సార్లు అలా అంటుండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగేసా.. “మాట్లాడితే మా చిరంజీవి అంటావ్ ఎందుకు” అని.. అప్పుడు ఆమే “మా ఇద్దరిదీ ఒకటే కులం” అని తన భార్య చెప్పిందని.. అందుకే మా చిరంజీవి అంటుందని తెలుసుకున్నానన్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి వలెనే తన భార్య కులం తనకి తెలిసిందని చెప్పారు విజయేంద్రప్రసాద్. అయితే తన కొడుకు రాజమౌళి బాహుబలి సక్సెస్ చూడకుండా ఆమె చనిపోయిందని.. ఆర్నెళ్లపాటు కోమాలో ఉండి తరువాత చనిపోయిందని చెప్పారు విజయేంద్రప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here