Vikram : తమిళ టాప్ హీరోల్లో ఒకరైన విక్రమ్ సేతు, మల్లన్న, సమూరయ్,శివపుత్రుడు, నాన్న,అపరిచితుడు, ఐ వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో మల్లన్న, ఐ సినిమాలతో అలరించిన విక్రమ్ ఐ సినిమా తరువాత కొంత జోరు తగ్గింది. ఇక చియాన్ అని అభిమానులతో పిలిపించుకునే విక్రమ్ తనయుడు కూడా అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ తో ఇండస్ట్రీ కి పరిచయమాయ్యడు. పొన్నియన్ సెల్వన్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఆయన గుండె పోటు తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సినిమాల్లో పాత్రల కోసం నా ఆరోగ్యాన్ని లెక్కచేయను…
విక్రమ్ కథ పరమైన పాత్రలకు మొగ్గుచూపుతారు. ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని ఆలోచిస్తారు. కమర్షియల్ పంథా లో సినిమాలు తీసి హిట్లు కొట్టడం ఆయనకు నచ్చదు. అందుకే అటు కమర్షియల్ సినిమాలను టచ్ చేస్తూనే మరో వైపు ప్రయోగాలు చేస్తుంటారు. సేతు దగ్గరి నుండి, మొన్నటి ఐ సినిమా వరకు విభిన్న పాత్రలు చేసారు. ఇక ఓపెన్ హార్ట్ ఆర్కే లో ఆయన విభిన్న పాత్రలను ఎంచుకోవడం పట్ల అయనకున్న ఇష్టాన్ని చెప్పారు.
దీన్ని వల్ల ఆరోగ్యం పాడవుతుంది కదా అని అడుగగా సేతు సినిమా కోసం చాలా బరువు తగ్గాల్సి వచ్చింది అయితే అప్పుడు అంత ఆరోగ్యవంతంగా బరువు తగ్గలేదు అది తప్పు అయితే ఇపుడు ఐ సినిమా కోసం మాత్రం ఆరోగ్యంగా లావు తగ్గానని చెప్పారు. పాత్ర కోసం ఆరోగ్యం గురించి ఆలోచన ఉండదని చెప్పారు. ఐ లో మేనేజ్ చేదాం అని శంకర్ చెప్పిన నేను ట్రై చేసి బరువు తగ్గడం బాడీ బిల్డింగ్ రెండు చేశాను అయితే చాలా నెలలు షూటింగ్ చేయడం వల్ల కష్టమైందని ఆ బరువును అలాగే చాలా రోజులు మేనేజ్ చేయవలసి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన గుండె పోటు తో హాస్పిటల్ లో ఉండటం వల్ల ఈ వీడియో మరోసారి వైరల్ అయింది. ఆయన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…