Movie News

Nagarjuna : ఎందుకు పనికిరాడు అనుకున్న హీరో ఇపుడు టాప్ హీరో అయ్యాడు.. హిట్ అనుకున్న సినిమాలు ప్లాప్ అయ్యాయి..: నాగార్జున

Nagarjuna : కింగ్ నాగార్జున, అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి, తనకంటూ సొంత ఇమేజ్ తో టాప్ హీరోస్ లో ఒకరిగా నిలిచిన కింగ్ ఇప్పడు ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా కుర్ర హీరోలకు గ్లామర్ పోటీ ఇస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ఘోస్ట్ మూవీతో రానున్నారు. కరోనా పాండమిక్ వల్ల సినిమా ఆలస్యమైన యాక్షన్ సన్నివేశాల్లో ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపాడు నాగార్జున. ఘోస్ట్ సినిమా ప్రెస్ మీట్ లో  నాగ్ ఆసక్తికర వాఖ్యలు చేసారు.

పనికిరాడు అనుకున్న వాడు టాప్ హీరో అయ్యాడు…

సినిమాల ట్రెండ్ గురించి, ప్రేక్షకుల అభిరుచి గురించి నాగార్జున ఆసక్తికర వాఖ్యలు చేసారు. శివ తీసిన  వర్మ తోనే ఆఫీసర్ సినిమా తీసాను కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక నిన్నేపెళ్లాడుతా సినిమా తీసిన కృష్ణ వంశీ తో వెంటనే తీసిన చంద్రలేఖ సినిమా డిజాస్టర్ అయినది. ఈ సినిమా నచ్చుతుంది, ఈ సినిమా నచ్చదు అని ముందే తెలిస్తే అన్ని శివ సినిమాలు, అన్నమయ్య సినిమాలే తీసేవాడిని కదా అంటూ వాఖ్యణించారు.

ఇక నిన్నేపెళ్లాడుతా వంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసిన తరువాత వెంటనే అన్నమయ్య తీయాలన్నప్పుడు ఆ సినిమా నేను తీస్తే జనాలు ఒప్పుకోరు చూడరు అన్నాను కానీ రాఘవేంద్ర రావు నన్ను నమ్మి చేయి అని చెప్పాడు. సినిమా సూపర్ హిట్ అయింది. ఈహీరో పనికిరాడు అనుకున్నవాడు టాప్ హీరో రేంజ్ కి ఎదిగిన వారు ఉన్నారు. ఎవరు ఎప్పుడు టాప్ పొజిషన్ వెళ్తారో ఎవరు చెప్పలేరు. ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో చెప్పలేము అలా చెప్పగలిగితే అందరూ నెంబర్ 1 హీరోలే అవుతారు అని చెప్పారు. ఇక ఘోస్ట్ సినిమా గురించి చెబుతూ ఇది హార్రర్ సినిమా కాదు అందులో హీరో కోడ్ పేరు ఘోస్ట్ ఇక అతని పేరు విక్రమ్. ఒక పోలీస్ ఆఫీసర్‌ కథ అంటూ చెప్పారు . ఈ సినిమాకు గరుడ వేగా సినిమా దర్శకుడు పవన్ సత్తార్ డైరెక్టర్.

Bhargavi

Recent Posts

పెళ్లి రోజే విషాదం.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తిరిగి రాని వధువు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…

3 hours ago

రిజెక్ట్ చేశారని కుంగిపోకండి.. పూరి జగన్నాథ్ సూపర్ మెసేజ్ వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…

3 hours ago

కేసుతో విసిగిపోయిన జడ్జి.. 2046కి వాయిదా! తర్వాత షాకింగ్ ట్విస్ట్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…

3 hours ago

కొబ్బరికాయ కుళ్లిపోయింది.. సినిమా ఆగిపోయింది! బాలయ్య మూవీపై సముద్ర షాకింగ్ కామెంట్స్

దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…

3 hours ago

‘హనుమాన్’ మిస్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు పశ్చాత్తాపం!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…

3 hours ago

తల్లి కోసం తండ్రిని చంపిన కుమారుడు.. కడపలో షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…

3 hours ago