Featured

Babu Mohan : మల్లెమాల సంస్థని తిడతావా… అన్నం పెట్టిన సంస్థను తిట్టేది మూర్ఖుడే..: బాబు మోహన్

Babu Mohan : ఆహుతి, అంకుశం, అమ్మోరు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్ ఆ తరువాత వచ్చిన మామగారు సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసినా బాబు మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. మల్లెమాల సంస్థలో వరుస సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ లో నీలాదోక్కుకున్న బాబు మోహన్ జబర్దస్త్ గురించి ఇప్పటి కమెడియన్స్ గురించి మాట్లాడారు.

అన్నం పెట్టిన చేయిని కొరికేవాడు మూర్ఖుడు….

ఈ మధ్య జబర్దస్త్ నుండి అందరూ బయటికి వచ్చేస్తున్నారు. ఇక తాజాగా యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కిర్రాక్ ఆర్పి మల్లెమాల సంస్థను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి విమర్శలు చేసారు. ఇక విషయాలపై బాబు మోహన్ స్పందిస్తూ అవకాశాన్నిచ్చి అన్నం పెట్టిన సంస్థను విమర్శించడం తప్పు నాకు శ్యామ్ ప్రసాద్ గారు భిక్షం పెట్టారని ఇప్పటికి చెబుతాను ఆ రోజు ఆయన వరుసగా మూడు సినిమాల్లో అవకాశలు ఇవ్వకుంటే ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదు కదా, తల్లి నన్ను కనలేదు నేనే పూట్టాను, అని మూర్ఖంగా మాట్లాడితే ఏం చేయలేము.

కళామతల్లే వారిని చూసుకుంటుంది అంటూ చెప్పారు. అన్నం పెట్టిన చేయినే కొరకాలనుకోవడం తప్పు ఇండస్ట్రీ కి వచ్చినపుడే నువ్వు పెద్ద స్టార్ కాదు అపుడు నీ పేరు ఎంతమందికి తెలుసు కానీ ఆ షో వల్ల నీకు ఒక గుర్తింపు రాగానే ఆ సంస్థను విమర్శించడం తప్పు అంటూ పరోక్షంగా ఆర్పి ని విమర్శించారు. ఇక మళ్ళీ కుదిరితే కోటా గారు నేను కలిసి కామెడీ పాత్రాలు సినిమాల్లో చేయాలని ఉంది అంటూ ఆయన మనసులోని మాటను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

పెళ్లి రోజే విషాదం.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తిరిగి రాని వధువు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…

4 hours ago

రిజెక్ట్ చేశారని కుంగిపోకండి.. పూరి జగన్నాథ్ సూపర్ మెసేజ్ వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…

4 hours ago

కేసుతో విసిగిపోయిన జడ్జి.. 2046కి వాయిదా! తర్వాత షాకింగ్ ట్విస్ట్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…

4 hours ago

కొబ్బరికాయ కుళ్లిపోయింది.. సినిమా ఆగిపోయింది! బాలయ్య మూవీపై సముద్ర షాకింగ్ కామెంట్స్

దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…

4 hours ago

‘హనుమాన్’ మిస్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు పశ్చాత్తాపం!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…

4 hours ago

తల్లి కోసం తండ్రిని చంపిన కుమారుడు.. కడపలో షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…

4 hours ago