Featured

Hyper Adhi & Ram Prasad : కిర్రాక్ ఆర్పి చెప్పినవన్నీ అపద్దాలే… శ్యామ్ ప్రసాద్ గారు డబ్బులిచ్చి చాలా మందికి సహాయం చేసారు….: రామ్ ప్రసాద్ & హైపర్ ఆది

Hyper Adhi & Ram Prasad : ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లెమాల సంస్థ గురించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి విమర్శలు చేసాడు కిర్రాక్ ఆర్పి. తనకు జబర్దస్త్ ఫ్యూచర్ ఇస్తే జబర్దస్త్ కు మేము ఫ్యూచర్ ఇచ్చాము అంటూ మాట్లాడాడు. అన్నం సరిగా పెట్టరు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అసలు పట్టించుకోరు అంటూ తీవ్ర విమర్శలు చేసాడు కిర్రాక్ ఆర్పి.

ఆర్పి చెప్పేవన్నీ అపద్దాలే….

ఇక తాను చెప్పినవన్నీ అపద్దాలని ఎవరైనా నిరూపిస్తే నేను గుండు గీయించుకుంటా అంటూ ఆర్ పి ఛాలెంజ్ చేసాడు. దీంతో జబర్దస్త్ మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇవ్వడానికి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్నారు. కిర్రాక్ ఆర్పి ఆరోపణలన్ని అపద్దాలని, అలా అయితే జబర్దస్త్ లో ఇన్ని రోజులు ఎవరు కొనసాగరని, శ్యామ్ ప్రసాద్ గారు రష్మీ ఇల్లు కట్టుకోడానికి లోన్ కోసం షూరిటీ కావాలంటే మల్లెమాల సంస్థ ద్వారా షూరిటీ ఇచ్చారని, ఇక పరదేశి వల్ల అమ్మకు ఆరోగ్యం బాగోలేక పోతే ముందే తన జీతం కొన్ని నెలలకు వచ్చేది ఇచ్చేసారని చెప్పారు. అది కాక పరదేశి, దొరబాబులు ఒక కేస్ లో వైజాగ్ లో దొరికినా వేరే సంస్థలైతే పని ఇవ్వరు కానీ మల్లెమాల వాళ్ళు ఇచ్చారు అలాంటి సంస్థను అనకూడదు అంటూ కిర్రాక్ ఆర్పి ఒకప్పుడు జబర్దస్త్ ఉన్న సమయంలో జబర్దస్త్ సహాయాన్ని చెప్పే వీడియో చూపించారు. సుధీర్ ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్ల వేరే ఛానల్ కు వెళ్ళాడు తనకు ఇక్కడ అవమానాలేమి జరగలేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి అంటూ సుధీర్ రష్మీ ల గురించి మాట్లాడారు. మరి వేరే ఛానల్ లో కూడా అదే చేసారు కదా మరి దానికేం చెబుతాడు ఆర్పి అంటూ అన్నారు.

సుధీర్ మీద పంచులు తానే వేయించుకుంటాడు అలానే తాను ఫేమస్ అయ్యాడు ఎవరు కావాలని బలవంతంగా చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు. మల్లెమాల సంస్థలోనె ఉన్న ప్రసాద్ గురించి ఆర్పి మాట్లాడటం బాగోలేదని, ప్రసాద్ కు బాగాలేనపుడు మేము చేసిన సహాయం తాత్కాలికమే కానీ శ్యామ్ ప్రసాద్ గారు తనకు హెల్త్ బాగై రాగానే అవకాశలు ఇచ్చారు, ఇపుడు జాతిరత్నాలు షోలో లీడ్ తానే చేస్తున్నాడు నెలకు మూడున్నర లక్షల దాకా సంపాదిస్తున్నాడు. జబర్దస్త్  లో కిర్రాక్ ఆర్పి చెప్పిన పరిస్థితులు ఉంటే ప్రసాద్ ఎందుకు బయటికి పోలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago