Featured

Subhashini : సుమ వల్లే నేను బ్రతికున్నా.. బంగారు తల్లి అంటూ ఏడ్చేసిన నటి సుభాషిని

Subhashini : ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లగా బుల్లి తెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ సుమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. స్టార్ మహిళ షో ద్వారా సుమ ఇంట్లో మనిషిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీగా ఉన్న సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మాత్రం యాంకర్ గా వ్యవహరిస్తుంది.

ప్రతివారం ప్రసారమయ్యే ఈ క్యాష్ షోలో సెలబ్రిటీలు సందడి చేస్తూ ఉంటారు. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ లో కూడా నలుగురు సీనియర్ సెలబ్రిటీలు సందడి చేశారు.సీనియర్ యాక్టర్స్ జెన్నీ, బాలాజీ,కృష్ణవేణి, సుభాషిని ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ షో లో కనిపించనున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ క్యాష్ షో లో సుమ సీనియర్ యాక్టర్లతో ఫన్నీ టాస్క్ లు ఆడించింది.

ఈ క్రమంలో బట్టతల ఉన్న జెన్నీ తల మీద 10 సెకెన్లు నిమ్మకాయ ఉంచాలని టాస్క్ ఇచ్చింది. ఇక కృష్ణవేణీ గారికి 10 సెకన్లలో బియ్యంలో ఉన్న 10 రాళ్ళు ఏరమని టాస్క్ ఇచ్చింది. ఇలా ఈ షో లో సీనియర్ యాక్టర్లు తమ అల్లరితో సందడి చేశారు. ఇక ఈ షో లో బాలాజి, జెన్నీ కష్టతరమైన ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా సీనియర్ నటి సుభాషిని ఈ షోలో బాగా ఎమోషనల్ అయ్యారు. తనకి క్యాన్సర్ వచ్చిన సమయంలో సుమ తనకు ఎంతో సహాయం చేసిందని ఇప్పటికీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనకి కావాల్సిన మందులు అమెరికా నుండి తెప్పిస్తుందని చెప్పుకొచ్చారు.

అమెరికా నుంచి నాకోసం మందులు తెప్పించింది…

ఈ క్రమంలో సుభాషిని సుమా గురించి మాట్లాడుతూ నేను ఈరోజు ప్రాణాలతో ఉండటానికి కారణం సుమా. నాకు మళ్ళీ మనిషి జన్మంటూ ఉంటే నీ కడుపున కూతురుగా పుడతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుమ కూడా సుభాషిని వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. నువ్వు నా బంగారు తల్లివమ్మా అంటూ సుభాషిని సుమా నుదుటిమీద ముద్దు పెట్టి చాలా ఎమోషనల్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago