ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులలో పెళ్లి అంటే ఎంతో కష్టమైన పని.పెళ్లికి ఎంతో మంది జనాలు రావడంతో వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం కొంతమంది సమక్షంలో మాత్రమే పెళ్ళిళ్ళు జరగడం మనం చూస్తున్నాము.ఈ కొంత మంది కూడా ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారు మాత్రమే పెళ్లికి హాజరు కావాలనే రూల్స్ ఉన్నాయి. పెళ్లికి వచ్చిన బంధువులు సోషల్ డిస్టెన్స్ పాటించడం మనం చూస్తూ ఉంటాము. కానీ వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటించడం మీరు చూశారా..
సాధారణంగా పెళ్లి కార్యక్రమంలో వధూవరులిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఎన్నో పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పూజలు చేస్తుంటారు. కానీ బీహార్లోని ఓ జంట మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, ఒకరినొకరు తాకకుండా పెళ్లి చేసుకున్నారు. చివరికి వీరు దండలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కర్ర సహాయంతో మార్చుకోవడం వైరల్ గా మారింది.
ముందుగా అనుకున్న ప్రకారం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బీహార్ లో బెగూసరాయ్‌లో ఓ జంట పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.పెళ్లికి వచ్చిన అతిథులకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కుర్చీలు వేశారు. పెళ్లి మండపంలో శానిటైజర్ మాస్కులు ఎన్నో అందుబాటులో ఉంచారు. చివరికి వధూవరులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కర్రల సహాయంతో దండలు మార్చుకోవడం చూసిన అతిథులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా పలు శుభకార్యాలలో ప్రతి ఒక్కరు ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని, దేశం నుంచి కరోనాను తరిమేయాల వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది అంటూ ఈ పెళ్లి ఎంతో మందికి ఆదర్శం కావాలని అధికారులు ఈ వధూవరుల ఆలోచనలపై ప్రశంసలు కురిపించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…