Featured

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

Sai Pallavi: సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షోతోనే ఎంతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో
సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం ఎంతో హైలెట్ అయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా సాయి పల్లవిని హైలెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఈ సినిమాలో అనుకున్న విధంగానే సాయిపల్లవి పాత్ర కీలకంగా ఉండి సినిమాని ముందుకు నడిపించింది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడంతో నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

ఈ సినిమా కలెక్షన్లు రాకపోవడానికి సాయిపల్లవి కారణమని భావిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయిపల్లవి కాశ్మీర్ పండిట్లు హత్య గోవధ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే చాలామంది సాయిపల్లవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల సాయిపల్లవి పై కేసులు కూడా పెట్టారు.

సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా…

ఈ విధంగా సాయి పల్లవి మతాలను ఉద్దేశిస్తూ మాట్లాడటం వల్ల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూడము అంటూ మరికొందరు పెద్దఎత్తున సాయి పల్లవి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.దీంతో సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని అందుకే సినిమా కలెక్షన్లను రాబట్టలేకపోయింది అంటూ నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా నిరాశ కలిగించిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago