Categories: FeaturedMovie News

Shubhaleka Sudhakar : బక్కగా ఉన్నానని అన్వేషణ సినిమాలో ఆ పాత్ర నుండి తీసేసారు…. గౌతమీతో ఆ సన్నివేశం చేసేప్పుడు భయపడ్డాను….!

Shubhaleka Sudhakar : ‘శుభలేఖ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ సినిమా పేరునే ఇంటిపేరు గా పెట్టుకున్న శుభలేఖ సుధాకర్, చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్పి బాలసుబ్రమణ్యం చెల్లెలు ప్లే బ్యాక్ సింగర్ ఎస్పి శైలజ ను 1989 లో వివాహం చేసుకున్నారు. అనకాపల్లికి చెందిన సుధాకర్ మద్రాస్ వెళ్లి తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలకోసం ఆడిషన్ ఇచ్చారు. ఇక శుభలేఖ సినిమాలో విశ్వనాధ్ గారు మొదట ఆఫర్స్ ఇచ్చినా తమిళ సినిమా తునయ్ ముందు విడుదలైంది.

అన్వేషణ సినిమా లోని ఆ పాత్రలో తొలగించారు…

కేవలం సహాయక పాత్రలే కాకుండా విలన్ షేడ్ ఉన్న పాత్రలను కూడా సుధాకర్ చేసారు. అన్వేషణ, ద్రోహి సినిమాల్లో ఆయన విలన్ పాత్రల్లో అలరించారు. ఇక అన్వేషణలో అమ్మాయిలను వల వేసి బంధించే పాత్రచేసిన ఆయన, తొలుత ఆ సినిమాలో అమ్మాయిలను చంపే మెయిన్ విలన్ గా సుధాకర్ ని అనుకున్నా ఆ తరువాత బక్కపలచగా ఉన్న తాను చంపాడంటే బాగోదని కథలో మార్పులు చేసారని వివరించారు. సినిమా సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో దెబ్బలు బాగానే తగిలించుకుంటానని ఆ సమయంలో పాత్రలో ఉండటం వల్ల ఏం అనిపించదని, ఇప్పుడు కూడా అలానే ఉన్నానని, అమ్మ సీరియల్ సమయంలో యాక్సిడెంట్ సన్నివేశంలో దూకాల్సి వచ్చినప్పుడు దుకేసానని, వాళ్లంతా కంగారు పడ్డారని వివరించారు.

ద్రోహిలో ఆ సన్నివేశం చేయడానికి భయపడ్డాను….

కమల్ హాసన్ హీరోగా నటించిన ద్రోహి సినిమాలో శుభలేఖ సుధాకర్ నెగెటివ్ పాత్ర పోషించారు. అందులో ఒక అమ్మాయిలంటే పిచ్చి ఉండే వాడిగా నటించిన సుధాకర్ ఒక సన్నివేశంలో గౌతమీని అత్యాచారం చేయాలి. ఆ సన్నివేశం చేసేటప్పుడు బాగా భయపడ్డానని, ఇక నన్ను గమనించిన కమల్ హాసన్ సినిమా షూటింగులో స్టాఫ్ అందరిని బయటకు పంపి కేవలం కొంతమందిని మాత్రమే ఉంచి షూట్ చేయించారని చెప్పారు. అయినా షూటింగ్ రెండు రోజులు కావడం చాలా ఇబ్బందిగా భయపడుతూనే ఉన్నానని చెప్పారు. ఒక షాట్ అవ్వగానే గౌతమీ దగ్గరికి వెళ్లి సారీ చెప్పేవాడినని తన అనుభవాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago