Movie News

Marudhuri Raja : దాసరి గారు సినిమా ఎలా ఉందో చూడటానికి వచ్చి, ఆ సినిమా ఇచ్చేయమని అడిగారు : రైటర్ మరుదూరి రాజా

Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మారుధురి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ఒంటరి పోరాటం నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు.

దాసరిగారు సినిమా చూడ్డానికి వచ్చి కొనాలనుకున్నారు….

మారుధురి రాజా అన్న హరనాథ రావు గారు డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ లో ఉండటం, చిన్నతనంలో స్టేజి ప్లే బ్యాక్స్ ఎన్నో రాసిన మారుధురి రాజా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. అయితే మధ్యలో సినిమా డైరెక్షన్ వైపు వెళ్లాలని అనుకున్నారు. ఇక సినిమాను తీసాక దాసరి నారాయణ రావు గారు వచ్చి సినిమా మొత్తం చూసి ఆయనకు నచ్చడంతో సినిమా కొనుక్కోవాలని అనుకున్నారు. ఇక ఈవిషయంలో సినిమా నిర్మాతకు, దాసరి గారికి కొన్ని షరతుల విషయంలో తేడాలు రావడంతో దాసరి గారికి సినిమాను అమ్మలేదు. దీంతో సినిమాకు దక్కాల్సిన ఫలితం రాలేదనిపించింది.

ఈ విషయంలో నిర్మాతకి కానీ, దాసరి గారిది కానీ తప్పు కాదు. నేను డిమాండ్ చేయలేను అదే నా అసమర్ధత. అలా నేను లేకుండా ఉండుంటే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. ఇప్పటి దర్శకులు అలా లేరు, ఏదైనా నిర్మాతను డిమాండ్ చేసి వాళ్లకు కావాల్సింది తీసుకుంటారు. ఇప్పటి దర్శకులు కరెక్ట్ గా ఉన్నారు అంటూ వాఖ్యణించారు. ఇక సి కళ్యాణ్, దర్శకుడు వి వి వినాయక్ బావ అని పిలుస్తారని వివరించారు. ఇండస్ట్రీలో నాకు శిష్యులు లేరు అందరు బంధువులే అని చెప్పారు. మందు తాగడం వల్ల నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago