Movie News

Naresh : మహాబళేశ్వరంలో నరేష్, పవిత్ర లోకేష్… పెళ్లిచేసుకుంటారన్న రూమర్స్ తో వైరల్ అవుతున్న పిక్స్…!

Naresh : హీరోయిన్ విజయనిర్మల కొడుకుగా హీరోగా పరిచయమైన నరేష్ ఆ తరువాత కమెడియన్ గా, సహాయ నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఈయన ఈ సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా బాగా పాపులర్ అయ్యారు. ఎందుకంటే ముచ్చటగా మూడు పెళ్లిళ్లతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యడు. మూడో భార్యతో కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న నరేష్ ఈ మధ్యనే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

పవిత్ర లోకేష్ తో మహాబళేశ్వరం ట్రిప్ లో నరేష్…

ఇక తల్లి పాత్రలతో బాగా ఫేమస్ అయిన నటి పవిత్ర లోకేష్ వ్యక్తిగతంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. పవిత్ర లోకేష్ కన్నడ పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుని కొంత కాలానికి విడిపోయారు. ఇక ఇపుడు సీనియర్ నటుడు నరేష్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. చాలా రోజులుగా కలసి ఉంటున్న వీళ్ళిద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారట. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వీళ్లిద్దరూ మీడియా కంట తరచూ పడటంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

ఇక ఇపుడు ఏకంగా మహాబళేశ్వరం వెళ్లి అక్కడ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారట. ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతుండటంతో వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారనే మాటలు ఉపందుకున్నాయి. అయితే ఇన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలకు వీళ్ళిద్దరూ కనీసం స్పందించలేదు, దీంతో మరింత అనుమానం పెరుగుతోంది.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

7 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

7 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

7 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

7 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

7 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago