కాసేపట్లో వివాహం జరుగుతుందనగా.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగింది.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు.
వీరికి ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పెళ్లి ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతుండగా.. ఆ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక పెళ్లి జరుగుతుండగా.. పంతులు కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరాడు. వాళ్ల కోసం బంధువులు వెతికారు.. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థతి గత కొంత కాలంగా మంచిగా లేదని.. మానసిక వ్యాధితో బాధపడేదని పోలీసులు తెలుసుకున్నారు. చుట్టు పక్కల వారితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లింట్లో కూడా గొడవ పడిన ఆమె ప్రవర్తనతో జగన్నాథరావు విసుగు చెందాడు.
దీంతో ఆమెను చంపి.. తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు కన్న తల్లిదండ్రులు చనిపోయి.. అటు పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఆ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…