Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విశాల్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఇకపోతే తాజాగా విశాల్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆగస్టు 29వ తేదీ విశాల్ తన 46వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజుకు వేడుకలలో భాగంగా ఈయన చెన్నైలోని కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ ను కట్ చేశాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన తల్లి ఈ మార్కెట్లోనే కూరగాయలు పువ్వులు కొనుగోలు చేస్తూ ఉంటారని తెలియజేశారు అనంతరం ఈ వేడుకలలో భాగంగా ఈయన విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు.
గత కొంతకాలంగా హీరో విజయ్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి స్పందించినటువంటి విశాల్ విజయ్ రాజకీయాలలోకి వస్తే తప్పకుండా తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు.
ఇలా విజయ్ రాజకీయాలలోకి వస్తే తన మద్దతు ఉంటుందంటూ విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పుట్టినరోజు సందర్భంగా విశాల్ కీల్పాక్ లోని అనాధ ఆశ్రమానికి వెళ్లి అక్కడ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారితో పాటు కొంత సమయం గడిపి ఈయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…