Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు విష్ణు ప్రియ యాంకర్ గా కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలు చేసిన అనంతరం ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.
ఇకపోతే విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఇలా తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ విష్ణు ప్రియ చేసినటువంటి పోస్టులు అందరినీ ఎంతగానో కలిచి వేసాయి. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రియమైన అమ్మకు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరినీ వారి తల్లులతో ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఇందులో రాకింగ్ రాకేష్ నూకరాజు ఒక స్కిట్ చేశారు. ఆ కొడుకులు ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల తన తల్లి చనిపోతుంది ఇలా తల్లి చనిపోవడంతో తమవల్లే చనిపోయిందని ఆ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తారు.
ఈ సన్నివేశం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ సన్నివేశం చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతానమ్మా ఐ లవ్ యు సో మచ్ అమ్మ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే విష్ణు ప్రియని చూసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…