యాంకర్ గా, యూట్యూబర్ గా,బుల్లితెర, వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికీ పరిచయమైన విష్ణుప్రియ ఆ తరువాత బుల్లితెరపై సుడిగాలి సుదీర్ పక్కన “పోవే పోరా” కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇటు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చలాకీగా ఉంటూ నిత్యం తన అభిమానులను సందడి చేస్తుంటారు.కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ ఈమెకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం విష్ణు ప్రియకి బుల్లితెరపై కూడా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ తన శరీరాకృతి పై ఫోకస్ పెట్టారు.
ఈ విధంగా విష్ణుప్రియ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టడం చూస్తుంటే ఈమె ఏదైనా సినిమాలో కోసం ప్రయత్నిస్తున్నారా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ మెసేజ్ కు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా విష్ణు ప్రియ తన ఇంటిలో వీకెండ్ స్పెషల్ అంటూ ఓ పాటకు డాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
విష్ణుప్రియ నిన్న రాత్రి ట్రాంపోలిన్ పై డాన్స్ వేశారు. ట్రాంపోలిన్ స్ప్రింగ్ లాగ ఉండటంతో ఆమె చిన్నగా డాన్స్ వేసిన స్టెప్పులు మాత్రం భారీ స్థాయిలో వేసినట్టు కనబడుతుంది. ఈ వీడియోలో ఈమె వేసిన స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియ జంపింగ్ జపాంగ్ అంటూ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…