Vishnu Priya: విష్ణు ప్రియ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.పోవే పోరా కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైన ఈమె అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.అయితే గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈమె పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే తన సాంగ్స్ ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి విష్ణు ప్రియ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.
ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఉంది అనడం పూర్తిగా అవాస్తవం. ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రతి రంగంలోనూ మహిళలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు అంటూ ఈ సందర్భంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.
ఇలా ప్రతి ఒక్కరంగంలోనూ మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇకపోతే విష్ణు ప్రియ సైతం పలు సినిమాలో బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి ఈమెకు ఏ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ప్రశ్నఎదురవడంతో తాను ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోలేదని ఈమె సమాధానం చెప్పారు. ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…