Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎంతోమంది కంటెస్టెంట్లు సెలబ్రిటీలుగా మారి కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి సరికొత్త టాస్కులతో మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం గురించి ఇప్పటికే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హాట్ యాంకర్స్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో విష్ణుప్రియ రీతు చౌదరి ఒకరు. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు కలిసి పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా పొట్టి పొట్టి దుస్తుల ధరిస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.
బిగ్ బాస్ లో ఉండాలని కోరుకుంటున్నారు..
ఇక ఈ ఇద్దరు కూడా హౌస్ లోకి వెళుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో వీరికి ప్రశ్న ఎదురయింది. మీరిద్దరూ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విష్ణు ప్రియ సమాధానం చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే నేను కూడా 10 కేజీలు తగ్గుతానని ఆశపడుతున్నాను. ప్రేక్షకులు కూడా చాలామంది నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. వారి కోరిక నిజమైతే తప్పకుండా నన్ను బిగ్ బాస్ లో చూస్తారని ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇక రీతు చౌదరి కూడా తనది సేమ్ ఆన్సర్ అని చెప్పడంతో తప్పకుండా వీరిద్దరు హౌస్ లో అడుగు పెట్టబోతున్నారని ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…