Tamil Rockers: తమిళ్ రాకర్స్ సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ఒక స్టార్ హీరో నటించిన సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది అంటే మరికొన్ని గంటలలోనే ఈ సైట్ లో ఆ సినిమా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలకు ఖర్చు చేసి సినిమాని తీసే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే కొంతమంది వ్యక్తులు ఇలా పైరసీ ద్వారా సినిమాలను పలు వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తూ భారీ స్థాయిలో నిర్మాతలకు నష్టాలను తీసుకువస్తున్నారు.
ఈ విధంగా నిర్మాతలు సైతం ఇలాంటి పైరసీ విధానాన్ని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని మాత్రం ఆపడం కష్టతరం అవుతుంది. అయితే ఇటీవల ధనుష్ హీరోగా నటించిన చిత్రం రాయన్. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాని తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తూ ఈ సైట్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు.
కేరళ పోలీసులు ఇటీవల తిరువనంతపురంలో తమిళ రాకర్స్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజ్‌ను అరెస్టు చేశారు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళనాడులోని మదురైకి చెందినవారని మరియు అతను చాలా కాలంగా తమిళ్ రాకర్స్‌లో వివిధ చిత్రాల థియేటర్-ప్రింట్‌లను అప్‌లోడ్ చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే రాయన్ సినిమా అప్ లోడ్ చేస్తున్న సమయంలో ఈయన పోలీసులకు దొరికిపోయారు.
ఇలా పోలీసులకు పట్టుబడటంతో జెబ్ స్టీఫెన్ రాజ్ సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేస్తారనే విషయాల గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఒక సినిమా విడుదలైన తర్వాత వెనుక వైపు ఒక 6 నుంచి 7 సీట్ల వరకు బుక్ చేస్తారట అనంతరం మొబైల్ ఫోన్ బ్రైట్నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తారని ఈయన షాకింగ్ విషయాలను వెల్లడించారు.
జెబ్ స్టీఫెన్ రాజ్..
ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలను తమిళ్ రాకర్స్ సైట్ లో పోస్ట్ చేసిన ఈయన ఈ సినిమా విషయంలో పట్టుబడటమే కాకుండా షాకింగ్ విషయాలను బయట పెట్టడంతో పోలీసులు కేసు నమోదు ఇలాంటి పనుల వెనుక ఇంకా ఎవరెవరున్నారు అనే విషయాలపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…