Movie News

Balakrishna: బాలయ్య సూపర్ హిట్ చిత్రం సమర సింహారెడ్డిని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా బాలయ్య నటించిన సినిమాలలో ప్రేమ కథ చిత్రాలతో పాటు పౌరాణిక సినిమాలు కుటుంబ కథ నేపథ్యం ఉన్న చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాలో కూడా ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా బాలయ్య సినీ కెరీర్లో మొట్టమొదటి యాక్షన్ చిత్రం సమరసింహారెడ్డి.

డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ సిమ్రాన్ అంజలా జవేరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా అప్పట్లోనే 15 కోట్ల బిజినెస్ చేసే సంచలనం సృష్టించింది.

ఇలా ఇండస్ట్రీలోనే మొట్టమొదటి యాక్షన్ మూవీగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఎన్నో థియేటర్లలో శత దినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా కథ బాలయ్య కోసం రాసుకున్నది కాదట ఈ సినిమా కథతో డైరెక్టర్ బి గోపాల్ విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లారట.

వెంకటేష్ ఫస్ట్ ఛాయిస్..
ఈ సినిమా కథ వెంకటేష్ కు చాలా బాగా నచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఇలాంటి సినిమాల్లో తాను నటిస్తే పెద్దగా సూట్ అవ్వని అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వెంకటేష్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో సరాసరి గోపాల్ బాలయ్య వద్దకు వెళ్లారు. అలా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాలో భాగమై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు అనంతరం వెంకటేష్ జయం మనదేరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో యాక్షన్ మూవీ ద్వారా సక్సెస్ అందుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…

40 minutes ago

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…

46 minutes ago

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…

56 minutes ago

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

1 hour ago

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…

1 hour ago

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…

3 hours ago