Vishwak Sen: నాకు గౌరవం ఇవ్వలేదు… అందుకే సినిమా నుంచి తప్పకున్నా… అర్జున్ వ్యవహారంపై స్పందించిన విశ్వక్?

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ సీనియర్ హీరో అర్జున్ కాంబినేషన్లో ఆయన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ తెలుగు సినిమా చేయాలని భావించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అర్జున్ నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆలస్యం కావడానికి విశ్వక్ కారణమని అర్జున్ వెల్లడించారు.

సినిమా షూటింగ్ ప్రారంభించేముందు ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని ఆయన డేడికేషన్ లేని హీరో అంటూ అర్జున్ మీడియా ముందు విశ్వక్ గురించి వెల్లడించారు. ఈయనకి డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్, లిరిసిస్ట్ చంద్రబోస్ తో పడటం లేదని తద్వారా ఈ సినిమా నుంచి తప్పకున్నారని వెల్లడించారు. అయితే నాకు జరిగిన విధంగా మరొక దర్శక నిర్మాతలకు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈయనపై ప్రొడ్యూసర్ గిల్డ్ లో కంప్లైంట్ చేశానని తెలిపారు.

ఈ విధంగా అర్జున్ తన గురించి మీడియా సమావేశంలో మాట్లాడటంతో ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను సినిమా కథ విషయంలోనూ,డైలాగ్స్ పాటలు మ్యూజిక్ విషయంలో తాను స్పందించిన విషయం నిజమే అయితే నేను చెప్పిన విధంగా వాళ్లు పాటించలేదు కానీ అర్జున్ తాను చెప్పినట్టే వినాలని మొండిపట్టు పడ్డారు.

Vishwak Sen: నాకు గౌరవం ఇవ్వలేదు…

ఈ విధంగా నాకు నచ్చని చోట, నాకు గౌరవం లేని చోట పని చేయడం ఇష్టం లేకే తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్ అర్జున్ వ్యాఖ్యలకు స్పందించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ చెక్కులు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తాను నిర్మాతల మండలికి పంపినట్టు విశ్వక్ వెల్లడించారు. మరి ఈ సినిమా విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం ఏర్పడిన మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.